Take a fresh look at your lifestyle.

భారత్ సైన్యానికి మద్దతుగా జి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ

  • జై భారత్, పాకిస్తాన్ ముర్దాబాద్ నినాదాలతో హోరెత్తిన తుంగతుర్తి పట్టణం.

తుంగతుర్తి, ముద్ర: తుంగతుర్తి మండల నియోజకవర్గ కేంద్రంలో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ పై ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా శనివారం జీ .ఆర్ .ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు‌.ఈ మేరకు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు జాతీయ జెండాలను చేతులు పట్టుకుని భారత్ మాతాకు జై, వీరమరణం పొందిన జవాన్లకు జోహార్లంటూ, పాకిస్తాన్ ముర్దాబాద్ ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.పాక్ పై పోరాడుతున్న భారత్ సైన్యానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని పలువురు అన్నారు.ఈ కార్యక్రమంలో జీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, తాటికొండ సీతయ్య, గుండగాని రాములు గౌడ్, పెద్దబోయిన అజయ్, పాలవరపు సంతోష్, కాసం మల్లయ్య, పులిపంపుల సైదులు గౌడ్, గాజుల మహేందర్, ‌ కటకం వెంకటేశ్వర్లు, లాకవత్ యాకు నాయక్, ఎనగందుల గిరి, గోపగాని శ్రీను, గోపగాని వెంకన్న, పోలేపల్లి అశోక్, నల్లబెల్లి వెంకటేష్, ఉప్పుల నాగమల్లు, లాలు, నాగరాజు, అక్కెనపల్లి నరేష్, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.