Take a fresh look at your lifestyle.

పది నెలల్లోనే రేవంత్ ప్రజల్లో పలుచన అయ్యారు

  • ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించలేదు.. కేవలం కేసీఆర్ ను ఓడించారు.
  • కాంగ్రెస్ అంటేనే స్కాముల మయం.
  • సొంతమంత్రులు జైలుకు పోయిన చరిత్ర వారిది.
  • బీహార్ వెళ్ళి మమ్మల్ని గెలిపించండని రాహుల్ గాంధీ అడుతున్నారు.
  • మిమ్మల్ని గెలిపిస్తే తెలంగాణలో, హిమాచల్, కర్ణాటకలో ఏం చేస్తున్నారు.
  • లంచాలు ఇస్తే తప్ప పనులు కావు.
  • మోసాల మీద చర్చకు సిద్ధమా?
  • బీజేపీలో కాంపిటేషన్ పెరిగింది.
  • పార్టీ బలంగా ఉండేనే పోటీ ఎక్కువగా ఉంటుంది.
  • బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : పాలించడం చేతకాక పది నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి పలుచన అయ్యారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించలేదని, కేవలం కేసీఆర్‌ను ఓడించారని అన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కాముల మయమని, సొంత మంత్రులే జైలుకు వెళ్ళిన చరిత్ర ఆ పార్టీదని ఆయన విమర్శించారు.ఈ మేరకు మంగళవారం రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు..బీహార్ వెళ్ళి తమను గెలిపించాలని రాహుల్ గాంధీ ఓటర్లను అడుగుతున్నారని, అయితే కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో మీరేమి చేశారని అక్కడి ఓటర్లు రాహుల్ ను ప్రశ్నిస్తున్నారని అన్నారు.లంచం ఇస్తే తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదని దుస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద, చేస్తున్న మోసాల మీద అబిడ్స్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు.

  • బీజేపీలో ఇంత కాంపిటేషన్ ఎప్పుడూ లేదు.

పార్టీలలో వైరుధ్యాలు ఉండటం సహజమని, బీజేపీలో ఇంత కాంపిటేషన్ ను తానెప్పుడూ చూడలేదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.పార్టీ పదవుల కోసం నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ పోటీ పెరుగుతుందంటే బీజేపీకి బలం ఉన్నట్లు అర్ధమవుతుందన్నారు.బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు భుజం భుజం కలిపి నడుద్దామని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. కొట్లాడే వారిదే విజయం.పోరాటమే మనల్ని బ్రతికిస్తుంది,దిమ్మ తిరిగాలి.పనులు చేస్తామని హామీలు ఇవ్వండి. కేంద్రంలో అధికారంలో ఉన్నది మనం.కేంద్రం అండ లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి లేదని మర్చిపోకండి’అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అని అన్నారు.

  • బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు.

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను నమ్మే పరిస్థితి లేదు అని వారు చేసినవి ఏకరువు పెడితే.. ప్రజలు ఎన్నటికీ నమ్మరు అని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. డబ్బులు పెట్టి సభలు పెడితే ప్రజలు వారివైపు వస్తారని అనుకుంటున్నారని విమర్శించారు. ప్రజల హృదయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి చోటు లేదని అన్నారు. ముమ్మాటికే ఆదరించేది బీజేపీనే.. పవర్ అనే ఆర్బిట్‌లోకి ఎంటర్ అయ్యాం అని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.ఈ రాష్ట్రం అప్పులు తీరాలన్నా, పురోగమనం చెందాలన్నా మోడీ అండలేకుండా సాధ్యంకాదని ప్రజలకు అర్థం అయ్యిందని అన్నారు. 2026లో,28లో ఎప్పడు ఎన్నికలు వచ్చినా గెలిచేది బీజేపీనే అని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.‘45 ఏళ్లుగా బీజేపీ కార్యకర్తల త్యాగాలుచేసి కళ్లలో వత్తులు వేసుకొని అధికారం కోసం ఎదురుచూస్తున్నారు. దేశంలో ఇద్దరు పార్లమెంట్ మెంబర్స్ గెలిస్తే ఒకటి తెలంగాణ ఇంకోటి గుజరాత్ నుండి గెలిచారన్నారు. గుజరాత్‌లో 27 ఏళ్ల తరువాత కూడా మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ సారి మన దగ్గర కూడా అధికారం రాబోతుంది’అని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.

  • గతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా చేసిందేమీ లేదు.

సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్లు నిలబడి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసింది ఏమీ లేదన్నారు.మంత్రిగా పనిచేసిన అనుభవం రేవంత్ కు లేదని విమర్శించారు.కడుపుకట్టుకొని పనిచేస్తే సంవత్సరానికి రూ.40 వేల కోట్లు పెట్టడం పెద్ద సమస్య కాదు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఎటు పోయారని ఆయన ప్రశ్నించారు.15 శాతం లంచం ఇవ్వకుండా కాంట్రాక్టర్స్‌కి బిల్లులు ఇవ్వడం లేదని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ వాళ్ళ ముఖాలకు ప్రభుత్వం నడపడం చేతకావడం లేదని, కాంగ్రెస్ మళ్లీ గెలవదని ప్రజలు భావిస్తున్నారు అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.