Take a fresh look at your lifestyle.

పాఠశాలల్లో సివిల్ వర్క్స్ పనులను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

పీ.ఎం.శ్రీ నిధుల నుండి మంజూరీ చేయబడిన పాఠశాలల్లో సివిల్ వర్క్స్ పనులను పెండింగ్ లేకుండా మార్చి, 15 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం మినీ మీటింగ్ హల్ లో పీఎం శ్రీ క్రింద చేపట్టిన పనులను ఎంత మేరకు పూర్తి చేయడం జరింగిందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల కు మంజూరైన నిధులను నిబంధనల మేరకు ఎంత మేర నిధులు వినియోగించారని ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పీఎం శ్రీ పథకం పరిధిలో ఉన్న పాఠశాలలలో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, అదనపు తరగతి గదులు, లైబ్రరీ గదుల నిర్మాణం గురించి మంజూరైన నిధులను పాఠశాలలలో ఉన్న పనులను పూర్తి చేయాలని, పెండింగ్ లేకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. కోటమర్తి, మల్లాపూర్, భువనగిరి గంజ్ పాఠశాలలలో సమస్యలను గుర్తించి, ఇంజనీర్ వాటిని నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ ఇంజనీర్ ను ఆదేశించారు.
పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం చేపట్టిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో సక్రమంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులతో నిరంతర సమన్వయం పాటించాలని అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్, డివిజనల్ ఇంజనీర్ శివకుమార్, ప్రధానోపాధ్యాయులు, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.