Take a fresh look at your lifestyle.

ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక మండల వ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభలు

 

ముద్ర ,తుంగతుర్తి

రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పంచాయతీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి గ్రామ సభల ముఖ్య ఉద్దేశమని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శేషు కుమార్ అన్నారు, గురువారం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలో నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అధికారులు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు, ఆయా గ్రామాల గ్రామసభలలో ఆరంభంలో రాష్ట్ర గీతం ఆలపించి సభలను ప్రారంభించి ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు, అనంతరం ఆయా గ్రామాల పంచాయతీల్లో ప్రభుత్వ అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి, రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు ధీమా, రేషన్ కార్డులకు సన్న బియ్యం సరఫరా, అర్హులందరికీ రేషన్ రేషన్ కార్డులు పంపిణీ, సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ తదితర సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు, అంతేకాక గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలు ఉంటే సభలో తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు, రేషన్ కార్డులు, పెన్షన్లు అర్హులైన వారుంటే దరఖాస్తులు చేసుకుంటే 99 రోజుల ప్రణాళికలో భాగంగా వాటిని పరిష్కరించనున్నట్లు తెలిపారు, ఆయా గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషియనున్నట్లు తెలిపారు, గ్రామాల్లో ఏ సమస్య ఉన్న గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రజలు అధికారులు దృష్టికి తీసుకురావాలన్నారు, ముఖ్యంగా గ్రామాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాల పురోగతి ని గ్రామ వార్డు స్థాయికి చేరుతున్నాయా లేదా కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అధికారులు వివరించారు, ఈ గ్రామ సభల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శేషు కుమార్, తాసిల్దార్ దయానందం, డిప్యూటీ తాసిల్దార్ కంట్లమయ్య , తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.