Take a fresh look at your lifestyle.

అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌లో అల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ

ముద్ర, కరీంనగర్ : అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (UGEE)లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచి మరోసారి తమ సత్తా చాటారు. అల్ఫోర్స్‌కు చెందిన వూట్కూరి శ్రేయాన్ రెడ్డి, గుజ్జుల అశీష్ రెడ్డి, గంగడి ఛైత్ర అద్భుత ప్రతిభతో ఐఐఐటి హైదరాబాద్‌లో సీట్ల సాధనకు నిర్వహించే ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, నిరంతర కృషి మరియు పట్టుదలతో ఎలాంటి పోటీ పరీక్షలలోనైనా విజయం సాధించవచ్చని తమ విద్యార్థులు నిరూపించారని అన్నారు. ఇంటర్వ్యూలో కూడా విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఐఐఐటి హైదరాబాద్‌లో సీట్లు సాధిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను ఆయన అభినందించి, వారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.