ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: అనదికార ప్లాట్లు,లే అవుట్లు క్రమబద్ధీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.మంగళవారం సాయంత్రం అడ్లూరు గ్రామ శివారులోని మున్సిపల్ వార్డు నెంబర్ 19 లోని సర్వే నెంబర్ 525 లో గల ప్లాట్లను మున్సిపల్,ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,భూముల క్రమబద్ధీకరణ పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న వారు 25 శాతం రాయితీతో డబ్బులు చెల్లిస్తే సదరు ప్లాట్లను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.కామారెడ్డి మున్సిపల్ పరిధిలో దరఖాస్తు చేసుకున్న అర్జి దారులు రాయితీ రుసుమును చెల్లించి క్రమబద్దీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్, రెవిన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
- పెట్టుబడి రాయితీలు మంజూరు
తెలంగాణ టీ ప్రైడ్, టీ పాస్ పెట్టుబడి రాయితీలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.మంగళవారం సాయంత్రం జిల్లా పెట్టుబడుల ఉన్నతీకరణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు టీజి ఐ – పాస్ క్రింద 1370 దరఖాస్తులు రాగా,పరిశీలించి 1327 దరఖాస్తులను ఆయా శాఖల ద్వారా పరిశీలించగా 1128 దరఖాస్తులు పరిశీలించి ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ తెలిపారు.టీ ప్రైడ్ పథకం క్రింద 12 మంది ఎస్సీ లబ్ధిదారులకు 34,68,551రూ.లు, నలుగురు ఎస్టీ లకు రు.11,59,319 లు పెట్టుబడి రాయితీ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వి.లాలు నాయక్, ఎల్ డి ఏం రవికాంత్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత,విద్యుత్ శాఖ ఎస్ ఈ శ్రావణ్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
