Take a fresh look at your lifestyle.

తెరుచుకున్న స్వర్ణగిరి ఆలయ తలుపులు

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
భూలోక వైకుంఠమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, సంప్రోక్షణాది వైదిక కార్యక్రమాలు అర్చక స్వాములచే భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
సమస్త శుద్ధి క్రతువులు సంపూర్ణంగా పూర్తి అయిన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుండి భక్తులకు శ్రీ వారి దర్శన భాగ్యం పునఃప్రారంభించారు.


సాయంత్రం ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.