ముద్ర, కుషాయిగూడ :
జర్నలిస్టుల సంక్షేమానికి తోడ్పాటు నందిస్తామని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ సముద్రాల కృష్ణమూర్తి అన్నారు. హెచ్పీ కాలనీ ఉమా ఆప్టికల్స్ అధినేత నేర్లకంటి శ్రీనివాస్ సమకూర్చిన సన్ గ్లాసెస్ చలువ అద్దాలను గురువారము ఆయన కాప్రా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలను వెలికి తీయడంలో జర్నలిస్టులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. జర్నలిస్టుల సంక్షేమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పూర్తి సహకారం అందజేస్తుందన్నారు. కాప్రా ప్రెస్ క్లబ్ మదర్ కమిటీ అధ్యక్షుడు వడ్లూజు జ్యోతిర్మయ చారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజె రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, వాసవి క్లబ్ ప్రతినిధులు పెనుగొండ వెంకటేశ్వర్లు లక్ష్మీ సామ్రాజ్యం, కాప్రా ప్రెస్ క్లబ్ మదర్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆదిమూలం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పలుగుల పవన్, లక్కిడి బాల్రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి గడ్డమీద బాలరాజు గౌడ్, సెక్రటరీ రోజా రాణి, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post