Take a fresh look at your lifestyle.

​జనసేనలోకి గాయత్రీ నగర్ మహిళలు: ఆహ్వానించిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

​ముద్ర కూకట్‌పల్లి :
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై కూకట్‌పల్లి నియోజకవర్గం, అల్లాపూర్ డివిజన్ గాయత్రీ నగర్‌కు చెందిన 31 మంది మహిళలు జనసేన పార్టీలో చేరారు. బుధవారం కెపిహెచ్‌బి పార్టీ కార్యాలయంలో జనసేన నాయకుడు పవన్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సైబరాబాద్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
​ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని, వారి భాగస్వామ్యం పార్టీకి మరింత బలాన్నిస్తుందని పేర్కొన్నారు. పారదర్శక పాలన, సామాన్యుల హక్కుల పోరాటమే జనసేన లక్ష్యమని, కొత్తగా చేరిన వారంతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి జోన్ కో-ఆర్డినేటర్లు మండలి దయాకర్, కొల్లా శంకర్, మండలి అనిల్, అడక్ కమిటీ సభ్యులు అనిత గాలి, వేముల మహేష్, పోలేబోయిన శ్రీనివాస్, రణదీప్, యోగేష్, జాల రవి, తుంగల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.