ముద్ర, శేరిలింగంపల్లి :
కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు రు.40,04,640 నలభై లక్షల నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్, భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు (40,04,640 ) నలభై లక్షల నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి చెక్కుల రూపేణా అందచేసిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్బంగా చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ ఈ రోజు 250 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని చైర్మన్ గాంధీ తెలియచేసారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్న లాగా నిలుస్తారని చైర్మన్ గాంధీ కొనియాడారు. నిరుపేల అడా బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు,మహిళ సోదరీమణులు మరియు లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు