కుషాయిగూడ , ముద్ర విలేఖరి: చర్లపల్లి డివిజన్ బిజెపి నూతన కమిటీని ప్రకటించారు. మంగళవారం బిజెపి చర్లపల్లి డివిజన్ అధ్యక్షులు చల్లా ప్రభాకర్ ఆధ్వర్యంలో శుభోదయం కాలనీలోని కాటమయ్య సామాజిక భవనంలో నిర్వహించిన సమావేశంలో పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులుగా ఎం. జనార్దన్, ఎం.లక్ష్మీనారాయణ ఎస్.అశోక్, డి.రామకృష్ణ గౌడ్, ఎస్.శంకర్, ప్రధాన కార్యదర్శిగా బి పవన్ కుమార్, కోశాధికారిగా కే బ్రహ్మచారి, కార్యదర్శులుగా టీ సంపత్, బాలకృష్ణారెడ్డి, పిట్ల కిషన్, అధికార ప్రతినిధులుగా పి. గణేష్ గౌడ్, ఆర్ వెంకటేశ్వర్లు ను ఎన్నుకొని వారందరికీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పూర్తిస్థాయి కమిటీ సభ్యులు డివిజన్లో బిజెపి పార్టీ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే నిత్యం ప్రజల్లో ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుక వెళ్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డి నాదం, ఎం లక్ష్మణ్ గౌడ్, కాసుల సురేందర్ గౌడ్, కొమ్ము నర్సింగరావు, ఆనంద్ గౌడ్, గణేష్ ముదిరాజ్, హరి నాయక్, విద్యాసాగర్, సహదేవ్ గౌడ్ , రమేష్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.