- లైన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ప్రముఖ వ్యాపారవేత్త రిటైర్డ్ టీచర్ పాలవరపు సంతోష్.
తుంగతుర్తి, ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో తుంగతుర్తి నూతన లైన్స్ క్లబ్ కమిటీని మంగళవారం ఎన్నుకున్నట్టు లైన్స్ క్లబ్ సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ గుడి పూడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన లైన్స్ క్లబ్ అధ్యక్షునిగా పాలవరపు సంతోష్ ప్రధాన కార్యదర్శిగా పులుసు వెంకన్న కోశాధికారిగా గుండ గాని రాము ఉపాధ్యక్షులుగా తల్లాడ కేదారి కార్యదర్శిగా ఎనగందుల గిరి కోఆర్డినేటర్లుగా ఓరిగంటి శ్రీనివాస్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి తాళ్లపల్లి యాదగిరి లు ఎన్నికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా లైన్స్ క్లబ్ గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి దోసపాటి గోపాల్ సతీష్ కుమార్ కె వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.