ముద్ర, ప్రతినిధి భువనగిరి :
పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది ఎర్రం లక్ష్మి విచ్చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానమని మహిళలు అన్ని రంగాల్లో విజయాన్ని సాధించాలని, ప్రతి పనిలో పురుషులతో సమానంగా ముందుండాలని సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో మంచి విజయాలు అందుకుని ప్రయాణం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ మహిళ లెక్చరర్లు, అతిధులు మహిళా సిబ్బంది అందరికీ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు తోటకూరి రామకృష్ణ, కనక బాలరాజు, ఎండీ.అత్తరు ఫరీన్, కూరపాటి స్రవంతి వల్లస్ అలివేలు మహిళా లెక్చరర్లు ఎన్ సుధా, సుమలత, సరిత, సంధ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.