Take a fresh look at your lifestyle.

మహిళా కానిస్టేబుళ్లకు ఘనంగా సన్మానం ​కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ముద్ర ​కూకట్‌పల్లి :

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుళ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ రక్షణలో పురుషులతో సమానంగా మహిళా పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో మహిళల భాగస్వామ్యం గర్వకారణమని, వారు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. అనంతరం మహిళా కానిస్టేబుళ్లకు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేసి వారిని సత్కరించారు

Leave A Reply

Your email address will not be published.