వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ద్ పేర్కొన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ వేగవంతం చేయాలనే ఉదేశ్యంతో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సోమవారం బీర్పూర్ మండలం చర్లపల్లి, నరసింహుల పల్లి, కందెన కుంట, తుంగూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్ కవర్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకొని వారి ధాన్యమును రక్షించుకునే విధంగా చూడాలని అన్నారు. ఈ పరిశీలనలో DSO జితేందర్ రెడ్డి, తహసీల్దార్ సుజాత, సంబంధిత అధికారులు, రెవెన్యూ సిబ్బంది, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.