- విద్యార్థులకు పస్తులు.
ముద్ర, పెబ్బేరు : వంట చేసే వర్కర్లకు, ప్రిన్సిపల్కు మధ్య తగాదా జరగడంతో స్టూడెంట్ పస్తులున్న ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ గర్ల్స్ స్కూల్లో జరిగింది. రోజూ వంట మనుషులు వంట చేయకుండా సతాయిస్తుంటంతో స్కూల్ ప్రిన్సిపల్ కవిత మంగళవారం వారితో వాగ్వాదానికి దిగారు. మాటా మాటా పెరిగి గొడవ పెద్దదవడంతో వంట చేయడానికి రాము అని చెప్పి వంట మనుషులు వెళ్లిపోయారు. దీంతో మధ్యాహ్నం వంట చేసేవారు లేకపోవడంతో సమయానికి భోజనం చేయాల్సిన స్టూడెంట్స్ పస్తులున్నారు. వంట కాంట్రాక్టరు కూడా లీవ్ పై వేరే ఊరు వెళ్లడంతో ఆయనను పిలిపించి ఇద్దరు వంట మనుషులను తీసుకొచ్చి వండించారు. దీంతో మధ్యాహ్నం 1 గంటకు తినాల్సిన స్టూడెంట్స్ 3.30 గంటలకు తినాల్సి వచ్చింది. ఈ విషయం ఎంఈవో జయరాములు అక్కడికి వచ్చి ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట చేసేవాళ్లు దొరకడం లేదని ఇబ్బందిపడుతుంటే ఇక్కడ వంట చేసేవాళ్లతో గొడవపడి పంపించినందుకు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి స్టూడెంట్స్కు టైమ్ ప్రకరాం ఫుడ్ వడ్డించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంటనే కొత్త వంట వాళ్ల ఏర్పాటు చేసి స్టూడెంట్స్ ఇబ్బందిపడకుండా చూస్తామని ప్రిన్సిపల్ కవిత ఎంఈవోకు చెప్పారు.
