ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ ఎన్నికయ్యారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి ఆదేశానుసారం బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నాకోటి నగేష్, చీమల రాజు, ఏలే భువనేశ్వరి శివ పాల్గొని ఏకగ్రీవంగా చేన్న స్వాతి మహేష్ ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కుశంగల ఎల్లమ్మరాజు పాల్గొన్నారు.