Take a fresh look at your lifestyle.

మహిళలు, పిలల్ల భద్రతపై భోరోసా సెంటర్ సిబ్బంది అవగాహన.

 

ముద్ర సూర్యపేట జిల్లా ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఐదవ అంశం మహిళల భద్రత పిల్లల భద్రత మాదకద్రవ్యాల నిర్మూలన సందర్భంగా ఎస్పి నరసింహ ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీసు మహిళా భరోసా సెంటర్ సిబ్బంది జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నందు, వివాహ, షీ నీడ్స్ షాపింగ్ మాల్స్ నందు మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భరోసా సెంటర్ సిబ్బంది మాట్లాడుతూ మహిళలపై వేధింపులు జరిగిన ఎలాంటి ఆకృత్యాలు జరిగినా వాటిని ఉపేక్షించకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని వేధింపులపై ఫిర్యాదు చేస్తేనే వాటిని అరికట్టవచ్చునని సూచించారు. మహిళలు విద్యార్థులు పిల్లల భద్రతలో చట్టాలు బలోపేతం చేయబడ్డాయని గుర్తు చేశారు.  పిల్లల కు మంచిస్పర్శ, చెడు స్పర్శ ,ఎవరేది ఇచ్చిన తీసుకోవద్దని చెప్పాలని  చెప్పడం  జర్గింది. అలాగే  లింగ సమానత్వం గురించి  వివరించడం  జర్గింది.

ప్రస్తుత సమాజంలో యువత మాదకద్రవ్యాల బారిన పడి వారి ఆరోగ్యాలను భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు పిల్లల నడవడిక పట్ల శ్రద్ధ వహించాలని ఏమైనా తప్పుడు మార్గంలో వెళ్ళినట్లయితే వారిని గమనించి  తగిన  జాగ్రత్త లు తీసుకోవాలని  సూచించారు. ప్రాముఖ్యత ను వివరించడం  జర్గింది.

ఈ కార్యక్రమంలో  పవిత్ర, జ్యోతి,కిరణ్మై,వనజ,శృతి, ప్రమీల పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.