Take a fresh look at your lifestyle.

ప్రజల సమస్యల చట్టపర పరిష్కారానికి తక్షణ కృషి.- జిల్లా ఎస్పీ కె నరసింహ

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి

పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పి నరసింహ జిల్లా పోలీస్ కార్యాలయం నందు పిర్యాదుదారులతో మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన పిర్యాదుదారుల నుండి పిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు, సూచనలు చేసి సమస్యల పరిష్కారానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు బరోసా కల్పించాలి అన్నారు.
ఎలాంటి సమస్యలు ఉన్న ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.