- కాంగ్రెస్ నాయకులు.
రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి :గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక సూపర్ బజార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల 14వ వార్డులో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పై బీఆర్ఎస్ నాయకులు చేసిన విమర్శలను కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, పిలిగిరి కనకరాజు,గోపు రాజాం పాల్గొన్నారు.