Take a fresh look at your lifestyle.

మల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నిరాహారదీక్ష

ముద్ర, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరాహార దీక్షకు దిగారు. మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర పారా మెడికల్ వైద్యుల ఐక్యవేదిక అధ్యక్షులు ఉక్కుల అశోక్ ఆధ్వర్యంలో పలువురు నిరహార దీక్ష చేపట్టారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న ఎమ్మెల్యే రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని, నియోజకవర్గం అభివృద్ధికి పార్టీ అధిష్టానం కృషి చేయాలని వారు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.