Take a fresh look at your lifestyle.

నాగసానిపల్లిలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు

 

ముద్ర పెబ్బేరు

శ్రీరంగాపూర్ మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోPACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఇరువురు ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి మాట్లాడుతూ, అన్నదాతలు ఎవరు కూడా అధైర్య పడరాదని, వారు సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఆమే పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వారు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలలో విక్రయించవచ్చునని దళారుల మాటలు నమ్మే మోసపోకూడదు వారు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే అన్నదాతలకు ఎలాంటి సమస్యలు రానివ్వకుండా నిర్వాహకులు ప్రత్యేక దృష్టి దృష్టి సారించాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుజాత, సీఈవో శివ, ఆనంద్ రెడ్డి, భీరం రాజశేఖర్ రెడ్డి, రామ్ రెడ్డి, యుగంధర్ రెడ్డి,రాజశేఖర్ యాదవ్, నిర్వాహకులు మార్ల కురుమూర్తి, శేఖర్ నాయుడు, గోవిందు, రాముడు, పరమేష్, మారుతయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.