ముద్ర కూకట్‌పల్లి :
కూకట్‌పల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచంద్ర రావుతో కలిసి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ని మర్యాదపూర్వకగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.
కేపీహెచ్‌బీ కాలనీ మోదటి రోడ్ లోని సర్వీస్ రోడ్డు విపరీతమైన ఆక్రమణలకు గురైందని, దీనివల్ల నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
స్థానిక దేవాలయాల ప్రహరీ గోడల పక్కనే హలీం సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఆ ప్రదేశాల్లో రద్దీ పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
కెపిహెచ్బి 3వ ఫేజ్ లోని ఎల్ ఐ జి పార్కులు ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని, దీనివల్ల స్థానిక నివాసితులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు భయాందోళనకు గురవుతున్నారని డీజీపీకి వివరించారు.
”కూకట్‌పల్లిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ప్రజల దైనందిన జీవనానికి ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని మాధవరం కాంతారావు డీజీపీకి వివరించారు