Take a fresh look at your lifestyle.

విద్యార్థిని నిర్బంధించిన నలుగురిపై కేసు నమోదు

  • వివరాలు వెల్లడించిన సీఐ జగదీష్

ముద్ర, ఇబ్రహీంపట్నం: విద్యార్థిని నిర్బంధించి చితకబాదిన నలుగురు వ్యక్తులపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం సీఐ ఐ జగదీష్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఆయన తెలిపిన ప్రకారం వివరాలు.. నోముల బీసీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న శివ అనే విద్యార్థి హాస్టల్ నుండి తప్పించుకుని ఇబ్రహీంపట్నం మంచాల రోడ్ లో ఉన్న మెగా డీమార్ట్ లో డబ్బులు చెల్లించకుండా చాక్లెట్ తిన్నాడు. సీసీ టీవీలో చాక్లెట్ తిన్నాడని గమనించిన మెగా డీమార్ట్ యాజమాన్యం ఆ బాలుడిని దుర్భాషలాడుతూ చితకబాదారు. అంతే కాకుండా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం వరకు మెగా డిమార్ట్ యాజమాన్యం బాలుడిని ఓ నిర్మానుష్య గదిలో నిర్బంధించారు. హాస్టల్ డిప్యూటీ వార్డెన్ మధు ఫిర్యాదుతో బాలుడిని చిత్ర హింసలకు గురిచేసిన మెగా డీమార్ట్ యజమాని ముజాహిద్ తో పాటు బషీర్, చింటూ, షమీర్ అనే నలుగురు వ్యక్తులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.