ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మండలం భువనగిరి మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ షానూర్ బాబా రంజాన్ పండుగ సందర్భంగా భువనగిరి మండలంలోని వడపర్తి, మన్నెవారీపంపు గ్రామాలలోని పారిశుద్ధ కార్మికులకు శుక్రవారం వడపర్తి గ్రామంలో దుస్తులను పంపిణీ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా కార్మికులు సంతోషంగా ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు షేక్ షానూర్ బాబాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ కే.సలీం పాషా, మల్లయ్య, రసూల్ పాషా, జమాల్, జహంగీర్ తదితరులు ఉన్నారు