Take a fresh look at your lifestyle.

రిటైర్డ్ ఉద్యోగులను రోడ్లపైకి తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డిది * ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

రిటైర్డ్ ఉద్యోగులను రోడ్లపైకి తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డిదని సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రం లో అంబేద్కర్ చౌరస్తాలో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగ,ఉపాధ్యాయుల బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూన్న నిరహార దీక్షకు అయన మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ 35ఏండ్లు కస్టపడి పని చేసి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను రేవంత్ రెడ్డి రోడ్ల మీదకు తెచ్చాడన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తుందని ఎన్నికల ముందు పెండింగ్ డి ఏ లు ఇస్తామని హామీలు ఇచ్చారు.


ఉద్యోగుల దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి రేవంతుకు మనసు రావడం లేదన్నారు.పదివేలు కోట్ల బకాయిలు ఇవ్వమని రిటైర్డ్ ఉద్యోగులు అడిగితే నన్ను కోసుకొని తిన్న డబ్బులు లేవని అంటున్నాడన్నారు. 96వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి, మూసి అభివృద్ధి కోసం లక్ష 50 వేలు పెట్టీ 10వేల ఇండ్లు కూల్చడానికి సిద్ధం అయ్యాడు రేవంత్ రెడ్డి అని ఏద్దేవా చేశారు. బడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తారు కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బులు ఇస్తారు కానీ ఉద్యోగులు కు ఇవ్వడనానరు.
రేవంత్ రెడ్డి కమిషన్ ఇచ్చే వారికి డబ్బులు ఇస్తారు కానీ కమిషన్ ఇవ్వని ఉద్యోగులకు డబ్బులు ఇవ్వరన్నారు. రిటైర్డ్ పెన్షన్ బెనిఫిట్ రాక 60 మంది చనిపోయారు, వారి చావుకు కారణం రేవంత్ రెడ్డి అన్నారు.
ఎన్ని ప్రాణాలు పోతే రేవంత్ రెడ్డి కండ్లు తెరుస్తారని ప్రశ్నించారు..
కెసిఆర్ హయంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు నెల లోపే బెనిఫిట్స్ ఇచ్చామని గుర్తు చేశారు.
92వేల ఉద్యోగులు కెసిఆర్ హయంలో రిటైర్డ్ అయితే వెంటనే డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులను అవమానించేలా విద్యా కమిషన్ రిపోర్ట్ ఉన్నది. మల్లన సాగర్ నుండి మూసి కి నీటిని తరలించేందుకు డబ్బులు ఉన్నాయి కానీ రిటైర్డ్ అయిన వారికి ఇచ్చేందుకు డబ్బులు లేవా అన్నారు. రైతులకు డబ్బులు ఇవ్వలేదు, మహాలక్ష్మి ఇస్తామని మహిళలను మోసం చేశారు,ఉద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో పోరాటముచేసి మీకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. ఉద్యోగులను రోడ్ పైకి తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. ఉద్యోగులు సంఘటితం అయి ప్రభుత్వం పై పోరాటం చేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లక్ష యాభై అయిదు వేల కోట్ల అప్పులు తెచ్చింది. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు రేవంత్ రెడ్డి అందులో పదివేల కోట్లు రిటైర్డ్ ఉద్యోగుల కోసం పెట్టుమని సలహా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.