Take a fresh look at your lifestyle.

కార్మికులు బాగుంటేనే పట్టణం బాగుంటుంది..పారిశుధ్య కార్మికులకు ఉచిత మెగా వైద్య శిబిరంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కార్మికులు బాగుంటేనే పట్టణం బాగుంటుందని మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక చివరి రోజు ఆదివారం భువనగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమం, పారిశుధ్య కార్మికులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛైర్పర్సన్ హాజరై శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పట్టణంలో అన్ని వార్డులలో వార్డు సభ్యుల, పట్టణ ప్రజల, అధికారుల సహకారంతో 35 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, సిడిఎంఏ లావణ్య, మున్సిపల్ కమిషనర్ జి.రామలింగం కౌన్సిలర్లు బొంతల నర్సింగ్ రావు, గంజి శ్రీవాణి గణేష్ రెడ్డి, జాలిగం విగ్నేశ్, మున్సిపల్ అధికారులు, డాక్టర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.