నేటి తరం మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
నైజం నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎదురునిలిచి పోరాడిన నాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారిమని మల్లు స్వరాజ్యమని నేటి తరం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ యండి జహంగీర్ తెలిపారు. గురువారం భువనగిరిలో సుందరయ్య భవన్ లో మల్లు స్వరాజ్యం 4వ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల చేసి ఘనమైన నివాళులు అర్పించి మాట్లాడుతూ
గతంలో నైజం రజాకార్లు, దోరలు పరిపాలించిన విధంగా దేశంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయని అన్నారు. అవి పేద ప్రజల సంక్షేమం మరచి దేశ వ్యాప్తంగా మతోన్మాద బావ జాలాన్ని పెంచి పోషిస్తు ప్రజల మధ్యన విభజన తెస్తుందని విమర్శించారు. అమెరికా చేస్తున్న యుద్ధం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విధంగా ఉందని దీనిపై దేశ ప్రధాని కనీసం స్పందించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, సిపిఎం జిల్లా కమిటి సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేష్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు మహేష్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ సిపిఎం భువనగిరి మండల కార్యదర్శివర్గ సభ్యురాలు కొండమడుగు నాగమణి, చిన్నయ్య, ప్రభాకర్ రెడ్డి, రాంబాబు పాల్గొన్నారు.