Take a fresh look at your lifestyle.

రైల్వే కట్ట నిర్వాసితులకు ఎకరానికి కోటి యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
నడికుడి నుండి బీబీనగర్ వరకు రెండవ లైన్ రైల్వే కట్ట (ట్రాక్) నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం కోటి యాభై లక్షల రూపాయలు (1.50) నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో ముఖాముఖిగా చర్చించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా నర్సింహ మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా రెక్కలు ముక్కలు చేసుకుని భూమి మీద ఆధారపడి జీవిస్తున్న రైతులు ప్రభుత్వ అవసరాల పేరుతో భూములను గుంజుకోవడంతో వీధినా పడుతున్నారని, అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదనూరి మల్లేశం , సిపిఎం సీనియర్ నాయకులు గునుగుంట్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్ , సిపిఎం శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్ , సిపిఎం గ్రామ నాయకులు తోటకూరి మల్లేష్ , బొల్లెపల్లి ప్రవీణ్ , రైతులు ఏదునూరి శ్రీశైలం , అందె శ్రీనివాస్ , గోగు మల్లేశం , ఏదునూరి కేశవులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.