Take a fresh look at your lifestyle.

చేనేత అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

చేనేత అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
శుక్రవారం స్థానిక లింగ బసవ గార్డెన్ లో చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత రుణమాఫీ, నేతన్న భరోసా, నేతన్న బీమా చెక్కులను ఆయన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలిసి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చేనేత రుణమాఫీ పథకం కింద 19.24 కోట్ల రూపాయలను, చేనేత భరోసా 3.29 కోట్ల, నేతన్న బీమా పథకం 2.40 కోట్ల నిధులను యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కార్మికులకు విడుదల చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశం, అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు భాస్కర రావు , అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ వెంక రెడ్డి, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, సహాయ సంచాలకులు చేనేత జౌళి శాఖ శ్రీనివాసరావు, కార్యాలయ సిబ్బంది, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.