ముద్ర నడిగూడెం…..
తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని బృందావనంలో గ్రామంలో గల ఎంపీపీఎస్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని సర్పంచ్ కంభంపాటి సరిత చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సరిత చైతన్య మాట్లాడుతూ ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు సహకరించాలని అన్నారు. విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. అనంతరం బడిబాట కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. మరియు సమ్మేటివ్ పరీక్షల నిర్వహణను పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం శ్రీనివాస్, ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం పద్మావతి, ఉపాధ్యాయులు, ఎండి మౌలానా, కత్తి వెంకటేశ్వర్లు, మాచవరపు సురేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు