Take a fresh look at your lifestyle.

జగిత్యాలలో బంద్ ప్రశాంతం

  • ఉగ్రదాడికి నిరసనగా స్వచ్చందంగా బంద్ పాటించిన వ్యాపార సంస్థలు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో హిందువులఫై ఉగ్రదాడిని నిరసిస్తూ శుక్రవారం హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు జగిత్యాల పట్టణంలో నిర్వహించిన బందు ప్రశాంతంగా జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో వర్తక వాణిజ్య సంస్థలు పెట్రోల్ బంకులు సినిమా హాళ్లు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బందు పాటించాయి.ఈ సందర్భంగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున కుల సంఘాలు, హిందూ ఐక్యవేదిక నాయకులు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బిజెపి నాయకులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి దుకాణాలను బందు చేయించారు.ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ పెహల్గాం లో టెర్రరిస్టులు హిందూ కుటుంబాలను గుర్తించి వారిని క్రూరంగా చంపడం భాధాకరం అన్నారు.అందుకు నిరసనగా బందుకు పిలుపు సహకరించిన కుల సంఘాలు వాణిజ్య సంస్థలకు హిందూ ఐక్యవేదిక సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ రఘు చందర్, పట్టణ సిఐ వేణుగోపాల్, ట్రాఫిక్ ఎస్ ఐ మల్లేశం ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బోయిని పద్మాకర్, నగర అధ్యక్షుడు అరుణ్ కుమార్, జిల్లా సహా కార్యదర్శి సంతోష్ కుమార్, నగర కార్యదర్శి ఎదురుగట్ల పరందాం, బజరంగ్దళ్ టౌన్ కన్వీనర్ పాదం మహేందర్, బిజెపి నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి, లింగంపేట్ శ్రీనివాస్, అంకరి సుధాకర్, సిపెళ్లి రవి, చీటీ శేఖర్, పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్, వీరబత్తిని అనిల్, ఆముద రాజు, రాగిళ్ల సత్యనారాయణ, హిందు వాహిని రాష్ట్ర సంపర్క ప్రముక్ వేముల సంతోష్,కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.