- జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గ్రంథాలు విజ్ఞానాన్ని సముపార్జిస్తాయని, సాహిత్య వేత్తలు, రచయితలు చరిత్రను నేటి తరాలకు అందించడం అభినందనీయమని, రచయితల వల్లనే చరిత్ర భావితరాలకు అందుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పేర్కొన్నారు.తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ ఆద్వర్యంలో జగిత్యాల పట్టణ మహిళ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం అనే గ్రంధాన్నిఎమ్మెల్యే ఆవిష్కరించారు. అంతకుముందు పహల్గాం ఉగ్ర మూకల చేతిలో మరణించిన వారికి సంఘీభావంగా మౌనం వహించి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల జిల్లా సమగ్ర చరిత్ర అందరూ చదవాలని, రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య మాట్లాడుతూ నిజాం కాలం నుండే తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని పరిరక్షించడంలో తెలంగాణ సారస్వత పరిషత్తు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని, 33 కొత్త జిల్లాలలో ఆయా జిల్లాల భాష, సాహిత్యాన్ని చారిత్రక నేపథ్యంలో సంగ్రహించే సదుద్దేశంతో వివిధ జిల్లాల సమగ్ర స్వరూపాలను పుస్తక రూపకంగా తీసుకోవచ్చామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో Deo రాము,సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య,మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్ గిరి నాగభూషణం,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డా. కె. రామకృష్ణ, తెలుగు విభాగాధిపతి డా. ప్రమోద్ కుమార్,డా. జి. శ్రీలత, జి. చంద్రయ్య, డా. వరప్రసాద్, ఎం.ఎ. రహీమ్, సంగీత రాణి, డా. వాసవి, కుమారి నీర్జ, మల్లికార్జున, జమున, మాజీ కౌన్సిలర్లు చుక్క నవీన్, తోట మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
