Take a fresh look at your lifestyle.

మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఇది సాధ్యం
తెలంగాణకు చెందిన ఆరుగురు మావోయిస్టులు మన రాష్ట్రంలో లేరు
తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవతరించిందని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టులు లేరని ప్రకటించారు. నక్సలిజాన్ని రూపు మాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఇది సాధ్యం అయిందని పేర్కొన్నారు. ఇంకా ఆరుగురు మావోయిస్టులు ఉన్నారన్న ఆయన ప్రస్తుతం వారు మన రాష్ట్రంలో లేరని అన్నారు. మిగిలిన మావోయిస్టులు కూడా పోలీసులకు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవాలని సూచించారు. మంగళవారం తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో డీజీపీ పర్యటించారు. కర్రెగుట్టలోని పామూనూరు బేస్ క్యాంప్ సమీపంలో పోలీస్ ఔట్ పోస్టును, ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మొరుమూరు నుంచి పామూనూరు వరకు దట్టమైన అడవుల్లో రోడ్డు నిర్మాణం చేశామని, డోలి, జెల్లా, చలిమెల గ్రామాలకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల అభివృద్ధి ధ్యేయంగా వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. పామూనూరు గ్రామస్థులకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడేందుకు ఆటో, ద్విచక్ర వాహనాన్ని అందించామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. వెనుక ఉన్న వ్యక్తులకు సైతం హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలన్నారు. హెల్మెట్ ధరించి ప్రయాణించడంతో రోడ్డు ప్రమాదాలు జరిగితే రక్షణగా ఉంటుదన్నారు. కారు ఇతర వాహనాలు నడిపే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సురక్షితమైన డ్రైవింగ్ చేయాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం అని కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఇంట్లో ద్విచక్రవాహనం నడిపే వారికి తప్పనిసరిగా హెల్మెట్ దరించేలా వివరించాలని అన్నారు. అనంతరం గ్రామస్థులకు హెల్మెట్లను అందజేశారు. అరైవ్ అలైవ్ అనే కార్యక్రమం పోస్టర్లు ఆవిష్కరించారు. అక్కడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్వో సువర్ణ, ఇంటెలిజెన్స్ ఐజీ విజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, ఎస్టి ఐజీ సుమతి , ఎస్పీ సుధీర్ రామ్ నాద్ కేకన్. డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ సీఐ ముత్యం రమేష్ ఎస్ఐ తిరుపతి రావు కృష్ణ ప్రసాద్, సతీష్,కన్నాయిగూడెం ఏటూరునాగారం మంగపేట ఎస్సై లు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.