జిన్నారం మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించండి: జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకు మెమోరండం సమర్పించిన మున్సిపల్ చైర్మన్ కీర్తి జనార్ధన్.. కౌన్సిలర్స్
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా,జిన్నారం మున్సిపల్ చైర్మన్ కీర్తి జనార్ధన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్యను కలిసి ఘనంగా శాలువతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేశారు.
జిన్నారం నూతన మున్సిపాలిటీలోని తీవ్ర నిధుల (బడ్జెట్) సమస్యలు నెలకొనడంతో పలు సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు మెమొరండం సమర్పించి పలు సమస్యలపై కూలంకచంగా చర్చించి వివరించారు. జిన్నారం మున్సిపల్ గ్రామీణ ప్రాంతం కాబట్టి అభివృద్ధిలో వెనుకబడి ఉన్నందున మున్సిపల్ కు సంపూర్ణ నిధులు లేనందున, మున్సిపాలిటీలోని వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి జిన్నారం మున్సిపల్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులను కేటాయించాలని కలెక్టర్ ని కోరడం జరిగింది.జిన్నారం మున్సిపల్ పరిధిలో పలుచోట్లలో కొన్ని రోడ్ల పరిస్థితి బాగాలేక బస్సులు సకాలంలో రాక విద్యార్థులు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఉన్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది, కలెక్టర్ పలు విషయాలపై సానుకూలంగా స్పందించి మీ జిన్నారం మున్సిపల్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేశానని హామీ ఇచ్చారని ఛైర్మెన్పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కిర్తిజనార్దన్ తో పాటు కౌన్సిలర్ ప్రభాకర్ రెడ్డి,పావని పరమేశ్వర్ రెడ్డి,బెలి కృష్ణ,ఆది గీతా రామకృష్ణ,పూజారి ప్రమోద రాజు,శ్రీలత నాగరాజు,ఆశా దేవి,శంకరప్ప శిల్పా నాగరాజు,బిఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.