ముద్ర, నారాయణ పేట :
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలని… పోలీసులంటే భరోసా భద్రత కలిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అన్నారు. బుధవారం ఎస్పీ నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, స్టేషన్ రికార్డులు, నమోదు అవుతున్న కేసుల వివరాలు పరిశీలించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వహించవద్దని, కేసు నమోదు అయిన వెంటనే బాధితులకు రిసిప్ట్ మరియు ఎఫ్ ఐ ఆర్ కాపీ తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ఘటనలపై సమాచారం అందిన వెంటనే బాధితుల వద్దకు వెళ్లి ఆన్‌సైట్ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ పెంచుతూ గ్రామాలను తరచూ సందర్శించాలని, పాత నేరస్థులపై నిఘా ఉంచాలని, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అక్రమ ఇసుక, బియ్యం, గుట్కా రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి అడ్డుకట్ట వేయాలన్నారు.