ముద్ర, గద్వాల:
ధరూర్ మండలం పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరీ, ఆలయ ఈఓ కవిత ఆలయ ధర్మకర్త గిరిరావు ఆధ్వర్యంలో మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉండి లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. హుండీ లెక్కింపులో 12 నెలలుగా దేవాలయానికి వచ్చిన ఆదాయం రూ. 10 లక్షల 73 వేల 245 రూపాయలు వచ్చిందనీ ఆలయ ఈఓ స్పష్టం చేశారు. గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం రూ.1,35,045 ఆదాయం అదనంగా సమకూరిందని ఆలయ ఈఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భీంపురం గ్రామ సర్పంచ్ గాళ్ల రఘు, ఆలయ ప్రధాన అర్చకులు, గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.