Take a fresh look at your lifestyle.

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన న్యాయ సేవా సంస్థ ప్రతినిధులు

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో సోమవారం (30-03-2026) బిజినపల్లి గ్రామంలోని లూర్ధునగర్‌లో ఉన్న ప్రశాంత నిలయం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ మరియు సెక్రటరీ ఆదేశాల మేరకు డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ శ్రీరామ్ ఆర్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఆశ్రమంలో మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా అనే విషయాన్ని విచారించారు. వృద్ధులతో పాటలు పాడించి వారిని ఉత్సాహపరిచారు. జీవితం లో వృద్ధాప్యం చివరి దశ కాబట్టి అందరూ ఆనందంగా, ఆహ్లాదకరంగా గడపాలని సూచించారు.

అలాగే, వారికి ఏవైనా అవసరాలు ఉంటే జిల్లా న్యాయ సేవా సంస్థ తరఫున సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వృద్ధులకు బిస్కట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు సిస్టర్ రవికుమారి మరియు వృద్ధాశ్రమ నివాసితులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.