Take a fresh look at your lifestyle.

ప్రజావాణి వినతులు పరిష్కారానికి  చర్యలు -కలెక్టర్ ప్రతిమా సింగ్ 

 

ముద్ర ప్రతినిధి,, మెదక్:

ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన వినతులు పరిష్కారానికి  అధికారులు తగు చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు.

సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అందిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పరిష్కార స్వభావం దరఖాస్తు దారునికి తెలియచేయాలని ఆదేశించారు.

ప్రజావాణిలో వచ్చిన  దరఖాస్తులు వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వస్తున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాధాన్యతతో స్పందించాలని ఆమె సూచించారు.

దరఖాస్తుల పరిష్కారంలో ఎటువంటి పర్యవేక్షణ లోపం ఉన్నా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈవో ఎల్లయ్య,డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

మెదక్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఏప్రిల్ 4న  మెదక్ ప్రైవేట్ ఐటిఐ (విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా)లో. ఉదయం 11 గంటల నుండి  జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. అపోలో ఫార్మసీ సంస్థలో హైదరాబాద్ లో పనిచేయుటకు అర్హతలు ఉన్నవారు హాజరు కావాలన్నారు.

18 సంవత్సరాల వయసు నుండి 35 సంవత్సరాల వయసు గలవారు, బి- ఫార్మసీ, డి- ఫార్మసీ, ఎం -ఫార్మసీ అర్హత, రూపాయలు 19,726  జీతంతో 25 ఫార్మసిస్ట్ ఉద్యోగాలున్నాయి.

18 సంవత్సరాల వయసు నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి 16,947 జీతంతో 20 ట్రైనీ ఫార్మసిస్ట్ ఉద్యోగాలున్నాయి.

అర్హత ,ఆసక్తిగల మెదక్ జిల్లాలో నిరుద్యోగ అభ్యర్థులు జాబ్ మేళాకు పూర్తి సమాచారంతో అనుభవం ఉన్నవారు, ఫ్రెషర్స్ పాల్గొనవచ్చని తెలిపారు.

మరిన్ని వివరాల కోసం 8247656356 నంబర్ను సంప్రదించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.