గొల్లపల్లి ,ముద్ర: జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలో శ్రీ గుండు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించి స్వామి వారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన్నారు.అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం భక్తుల సౌకర్యార్థం దేవాలయ ఆవరణలో సుమారు పది లక్షల వ్యయంతో నిర్మించనున్న షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు,హనుమాన్ దీక్షాపరులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ఊట్కూరి అశోక్ రెడ్డి ,మాజీ సర్పంచ్ లు చిర్ర గంగాధర్,రెవెళ్ల సత్యనారాయణ,తిరుపతి రెడ్డి, పురం శెట్టి వెంకటేష్,అరవింద్ గౌడ్, రమేష్ రెడ్డి,కొండ వెంకటేష్ గౌడ్,చెవుల మద్ది రమేష్,ఆవుల ప్రవీణ్,కసారపు ప్రవీణ్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హనుమాన్ దీక్షపరులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
