Take a fresh look at your lifestyle.

కుందన్ పల్లి 6వ వార్డులో.. విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి: ఏ డి ఈ నందకిషోర్

కుషాయిగూడ (కుందన్ పల్లి) , ముద్ర విలేఖరి: దమ్మాయిగూడ మున్సిపల్ కుందన్పల్లి 6వ వార్డులో.. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కీసర ఏడిఈ నందకిషోర్ పేర్కొన్నారు. కుందన్ పల్లి లో నెలకొన్న విద్యుత్ సమస్యలను తెలుసుకునేందుకు మాజీ కౌన్సిలర్ వరగంటి వెంకటేష్, కీసర ఏఈ మురళీకృష్ణ లతో కలసి ఏడిఈ నందకిషోర్ బుధవారం కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కాలనీలో విద్యుత్ స్తంభాలు, కేబుల్ లైన్ల ఏర్పాటును గుర్తించారు. అలాగే పలు విద్యుత్ లైన్లో పాడైపోయిన కేబుల్లను తొలగించి వాటి స్థానంలో కొత్త లైన్లను వేయాలని ప్రణాళిక చేశారు. ఇక మూడు కొత్త ట్రాన్స్ఫార్మర్లు కావాలని స్థానికులు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కుందన్పల్లి 6వ వార్డులో తమ దృష్టికి వచ్చిన విద్యుత్ అభివృద్ధి పనులకు ప్రతిపాదన చేసి త్వరలో పనులు పూర్తయ్యాలా చేస్తామని ఏ డి ఈ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికులు శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, అభిషేక్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.