Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం విచారణ పేరుతో తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసిఆర్ ను వేధిస్తే తిరుగుబాటు తప్పదు

  • తాటికొండ సీతయ్య మాజీ ఎంపీపీ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు.

ముద్ర, తుంగతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ విచారణ పేరుతో తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను వేధిస్తే ప్రజల నుండి ప్రభుత్వం పై తిరుగుబాటు తప్పదని మాజీ ఎంపీపీ బిఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య హెచ్చరిక చేశారు.తుంగతుర్తి సెంటర్లో సోమవారం కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిరసన తెలియజేసిన సందర్భంగా మాట్లాడారు.ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ కోటి ఎకరాల మాగాణి సస్య శ్యామలం చేయాలనే సంకల్పం తో కెసిఆర్ ఆసియా లోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మించి ఈ ప్రాంత రైతంగాన్ని ఆదుకుంటే మీరు పరిపాలన చేపట్టిన పద్దెనిమిది నెలల్లో రైతుల నోట్లోమట్టికొట్టిన మీరు కెసిఆర్ కు నోటిస్ ఇవ్వడం హరిశరావు కు నోటిస్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖందిస్తున్నాం అని అన్నారు. విచారణ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండాగానీ రాములుగౌడ్, మండల నాయకులు మట్టిపెల్లి శ్రీశైలం తునికి సాయిలు,దొంగరి శ్రీనివాస్,మట్టిపెల్లి వెంకట్,కడారిదాసు,మల్యాలా రాములు, కొండగడుపుల నాగయ్య,గోపగాని శ్రీనివాస్, ఉప్పుల నాగమల్లు, తడకమళ్ల రవి, కొండగడుపుల వెంకటేష్, బొజ్జ సాయికిరణ్, మల్లిఖార్జున్, సాయి, కొల్లూరి మహేందర్,అకారపు భాస్కర్,కోరుకొప్పుల వెంకన్న, భగవాన్, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.

  • రాష్ట్ర అవతరణ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ.

తుంగతుర్తి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను అలాగే పార్టీ జెండాను ఎగురవేసి స్విట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.