Take a fresh look at your lifestyle.

ఆహాలో ఉత్కంఠభరితమైన ఆంథాలజీ చిత్రం ‘4వ అధ్యాయం’కు అద్భుతమైన స్పందన

 

రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ‘అధర్మ కథైగళ్’ చిత్రంలో వెట్రి, సాక్షి అగర్వాల్, అమ్ము అభిరామి, దివ్య దురైసామి, సునీల్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తమిళంలో విడుదలైనప్పుడు మంచి ప్రశంసలు అందుకుంది. కామరాజ్ వేల్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ‘4వ అధ్యాయం’ అనే పేరుతో ‘న్యాయానికి అతీతం’ అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను కామరాజ్ వేల్ స్వయంగా తన బిగ్ బ్యాంగ్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు.

‘4వ అధ్యాయం’ నాలుగు ఉత్కంఠభరితమైన కథలతో అల్లుకుని ఉంటుంది. ప్రతి కథ ప్రతీకారంలోని విభిన్న కోణాలను, దానికి కారణమయ్యే అంశాలు, దాని పర్యవసానాలు, అది మిగిల్చే మానసిక క్షోభను ఎంతో ఎమోషనల్‌గా చూపించారు. ప్రతీకారం తీర్చుకోవాలనే తపనతో రగిలిపోయే కథతో ఎంతో సంక్లిష్టమైన లేయర్లతో ఈ ఆంథాలజీ అందరినీ ఆకట్టుకుంటోంది. విభిన్నమైన పాత్రలు, కథనంతో కామరాజ్ వేల్ తీసిన ఈ చిత్రం థియేటర్లో, ఓటీటీలో ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది.

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, సీటు అంచున కూర్చోబెట్టేలా ఉండే కథనం చివరి వరకు ఉత్కంఠను రేకేత్తించేలా ఉంటుంది. కథ, కథనంతో పాటుగా అద్భుతమైన సాంకేతిక బృందం కలిసి ఈ సినిమాని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లింది. ఈ మూవీలోని సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ ఇలా అన్నీ ఆడియెన్స్‌ని మెప్పించాయి.

ఆహాలో తెలుగు ప్రీమియర్ అయిన తర్వాత ‘4వ అధ్యాయం’ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటోంది. అన్ని భాషల్లో ప్రస్తుతం ఈ మూవీకి ఆదరణ దక్కుతోంది. ఇంకా చూడని వారు వెంటనే ఆహాలో ‘4వ అధ్యాయం’ని చూసి ఎంజాయ్ చేయండి.

Leave A Reply

Your email address will not be published.