ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా భువనగిరి పట్టణానికి చెందిన మెరుగు మధు ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా పూస శీను మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఉద్యమకారుల సంఘాలను సమైక్యపరచడానికి, ఏకతాటిపై తీసుకొని వచ్చి మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి ఉందని అన్నారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులను ఐక్యం చేసే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మెరుగు మధు అన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.