శిఖర ఇంటర్నేషనల్ స్కూల్, బౌరంపేట్ లో “అరైవ్ అలైవ్” కార్యక్రమం
ముద్ర,కుత్బుల్లాపూర్ :
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మూడవ రోజు, ఏ.సి.పి జీడిమెట్ల ట్రాఫిక్ డివిజన్ శ్రీ కె. వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని శిఖర ఇంటర్నేషనల్ స్కూల్, బౌరంపేట్ నందు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, హెల్మెట్ స్ట్రాప్ సరిగా ధరించకపోతే జరిగే ప్రమాదాలు, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ వినియోగం వంటి అంశాలపై వీడియోలను ప్రదర్శిస్తూ అవగాహన కల్పించడం జరిగింది.
అదేవిధంగా, రోడ్డు ప్రమాదాలకు గురైన విద్యార్థులతో మాట్లాడి, వారు చేసిన తప్పులను మరియు వారి అనుభవాలను మిగతా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. పోస్ట్ కార్డులను విద్యార్థులకు అందజేసి, వారు తమ తల్లిదండ్రులకు ట్రాఫిక్ నియమాలు పాటించాలని లేఖలు రాయడం ద్వారా వాటిని వారి చిరునామాలకు పోస్టు చేయాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ కె. వెంకట్ రెడ్డి గారు, శ్రీమతి హేమలత గారు (ప్రిన్సిపాల్, శిఖర స్కూల్, బౌరంపేట్), స్కూల్ స్టాఫ్ మరియు ఇతరులు పాల్గొన్నారు.