Take a fresh look at your lifestyle.

25 వసంతాల గులాబీ పండుగను విజయవంతం చేయండి.

  • కుంభమేళ తరహాలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ.
  • కేసీఆర్‌ పాలనను యావత్తూ తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.
  • రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: ఈ నెల 27 వ తేదిన వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరిగే 25 వసంతాల గులాబీ పండుగను విజయవంతం చేయాలని గులాబీ జెండాను గుండెకు హత్తుకుందామని ఊరు వాడా ఉప్పెనలా కదిలి ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దామని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు.సభను విజయవంతం చేయాలని కోరారు.శుక్రవారం సాయంత్రం గోదావరిఖని ప్రెస్ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 24 ఏళ్ల బిఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని రజతోత్సవ సభలో చర్చించండం జరుగు తుందని కనీవినీ ఎరుగని రీతిలో పండగ వాతావరణంలో కుంభ మేళా తరహలో కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.రామగుండం నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది ఈ సభకు తరలివెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో బషీర్ బాగ్ రైతుల మృతికి నిరసనగా ఆనాడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కెసిఆర్ తన పదవికి రాజీనామా చేసి పార్టీని స్దాపించి 14 ఎళ్ల అలుపెరని పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు.పదేళ్ల కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి నెంబర్ వన్ గా నిలిచిందని ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు.కెసిఆర్ పాలనలో వృద్ధులకు 2000 పెన్షన్ కళ్యాణ లక్ష్మి,మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీరు కాలేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట వ్యవసాయ రంగాన్ని సస్యశామలం చేశారని రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంటు సాగునీరు సకాలంలో ఎరువులు పెట్టుబడి సహాయం అందించిన మనసున్న మరాజు కేసీఆర్‌ అన్నారు.పదేళ్ల ప్రగతి ప్రస్థానం వెనక్కి పోయిందని తెలంగాణ ప్రజలు దిగాలు పడుతున్నారని కెసిఆర్ మళ్లీ సీఎం కావాలని తెలంగాణ ప్రజలంతా కోరుతున్నట్టు ఆయన తెలిపారు.రామగుండం నియోజక వర్గం నుంచి స్వచ్ఛందంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.ఈ విలేఖరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మురళీధర్ రావు, గోపు అయులయ్య యాదవ్, బోడ్డు రవీందర్,కుమ్మరి శ్రీనివాస్, కలవచర్ల కృష్ణవేణి,బొడ్డుపల్లి శ్రీనివాస్,జనగామ కవితాసరోజిని తోట వేణు,చెలకల పెళ్లి శ్రీనివాస్,అచ్చ వేణు,నూతి తిరుపతి, శ్రావణ్,వెంకటేష్,జక్కులతిరుపతి తిమోతి,కిరన్ జీ,రాములు, రామకృష్ణ,కర్రీ ఓదేలు,రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.