Take a fresh look at your lifestyle.

అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
కత్తితో గన్నుతో కాకుండా కలంతో పెన్నుతో పోరాట యుద్ధం చేసి గెలిచిన యోధుడు అన్ని వర్గాలకు హక్కులను సాధించిన ధీరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్, పచ్చల కట్ట సోమేశ్వరాలయం చైర్మన్ శ్రీ కొల్లూరి రాజు, 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విగ్నేష్, యువజన కాంగ్రెస్ నాయకులు పడిగల రేణుక ప్రదీప్ లు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేష్ చిస్తి, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, కౌన్సిలర్ సుమయ్య తబస్సుo, తాహీరా బబ్లు, జంగిటి వినోద్, గుర్రాల శ్రీనివాస్, నాయకులు దర్గాయి గణేష్, జాలిగం శివ, నీలం నరసింహ, దర్గాయి శ్యామ్ కుమార్, కుతాడి సురేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.