Take a fresh look at your lifestyle.

రేషన్ కార్డులు @91.83 లక్షలు

  • 3.10 కోట్లకు చేరిన లబ్దిదారులు.
  • కొత్తగా 27లక్షల మంది చేరిక.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య మొత్తం 91.83 లక్షలకు చేరింది. ఆయా కార్డుల్లో​ లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు పెరిగింది.గతంలో 2.83 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉండేవారు. అంటే ఇప్పుడు 27 లక్షల మందికి పైగా కొత్తగా అర్హత పొందారు. ఇప్పటికే రెండు లక్షల కొత్త కార్డులు జారీ అయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న దాదాపు 20 లక్షల అప్లికేషన్లను అధికారుల వడబోశారు. ఇందులో 18 లక్షల మందికి అర్హత లభించింది. జూన్ నెలలో మూడు నెలలకు సంబంధించిన 18 కిలోల సన్న బియ్యం ఒక్కో లబ్ధిదారుడికి ఒకేసారి ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 17 నుంచి మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు, గ్రామసభల ద్వారా వచ్చిన దరఖాస్తులపై కార్యాచరణ చేపట్టారు. కొత్తగా జారీ చేసిన 2 లక్షల కార్డుల కింద 9 లక్షల కొత్త లబ్ధిదారులకు రేషన్ లబ్ధి చేకూరుతుంది. లబ్ధిదారుల సంఖ్య పెరగడం ద్వారా అధిక మంది ప్రజలకు ప్రభుత్వ సాయం అందుతున్నది. పెండింగ్ దరఖాస్తు లను క్లియర్ చేయడం ద్వారా లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతున్నది. మిగతా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి సంబంధించిన పరిశీలన కూడా​ నిర్వహిస్తామని, రేషన్​ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.