రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పెద్దపల్లి అప్పన్నపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని శివాజీ నగర్ కు చెందిన సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్ సెక్యూరిటీ గార్డ్ గండ్ల సత్యం అక్కడిక్కడే మృతి చెందారు. తన స్వగ్రామం ఓదెలకు సత్యం,కూతురు లావణ్య ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో సత్యం మృతి చెందగా కూతురు లావణ్యకు గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కొరకు ఆమెను కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సత్యం మృతిపై తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతితో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.