Take a fresh look at your lifestyle.

భూ వివాదంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

  • కుల పెద్దలు ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ బాదుతుడి వద్ద సూసైడ్ లేఖ లభ్యం.

కోరుట్ల, ముద్ర విలేకరి:  భూ వివాదంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం కోరుట్ల పట్టణానికి చెందిన వన తడుపుల నాగేశ్వర వరప్రసాద్ గతంలో చౌలమద్ది గ్రామ శివారులో గల భూమిని కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన భూమిని గ్రామ కుల పెద్దలు తనకు తెలియకుండా వేరే వ్యక్తులకు భూమిని విక్రయించారంటూ బాధితుడు వాపోయాడు. ఈ క్రమంలో భూమికి సంబంధించిన తాను చెల్లించిన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని కోరగా ఇవ్వకపోగా దురుసుగా ప్రవర్తించారని బాధితుడు పేర్కొన్నారు. ఈ విషయమై విసుగు చెందిన వరప్రసాద్ బుధవారం రోజు ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. చూసిన స్థానికులు హుటా హుటిన స్థానిక మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జగిత్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాదితుడి వద్ద సూసైడ్ నోట్ లభ్యం కాగా పోలీసులు దానిని పరిశీలించారు. స్థల వివాదంలోని తనకు రావాల్సిన డబ్బులను తిరిగి ఇప్పించాలని, లేకపోతే నా కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉందని కోరుతూ జిల్లా కలెక్టర్, ఎస్పీకి విన్నవిస్తున్నట్టు బాధితుడు లేఖలో రాసుకున్నాడు.

Leave A Reply

Your email address will not be published.